నాగశౌర్యతో రొమాన్స్‌ చెత్త:సమంత

180
samantha nagashourya

రంగస్థలం,మజిలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సమంత లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఓ బేబి. జూలై 5న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సమంతకి పెయిర్‌గా నాగశౌర్య నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్రయూనిట్ ఒక్కో సాంగ్‌ని విడుదల చేస్తూ అంచనాలను పెంచేసింది.

ఇక సినిమా నుంచి విడుదలైన ‘నాలో మైమరపు’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయగా ఆ సాంగ్‌లో నాగశౌర్యతో రొమాన్స్ చేయడం చాలా చెత్తగా అనిపించిందని అన్నారు సమంత.నాగ శౌర్యకు విపరీతమైన సిగ్గు ఉండటంతో అతనితో రొమాన్స్ చేయడం చాలా చెత్తగా, కష్టంగా అనిపించిందని తెలిపింది.

నాగశౌర్యను రొమాంటిక్ మూడ్‌లో దించేందుకు కుక్కప్లాన్‌ని వర్క్‌అవుట్ చేశామన్నారు. శౌర్యకి కుక్కలు అంటే చాలా ఇష్టమని అందుకే కుక్కల గురించి అతనితో మాట్లాడి క్లోజ్ అవుతూ రొమాంటిక్ సీన్స్‌ని పండించామన్నారు.

సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు.