గుండుకి రెడీ అంటున్న హీరోయిన్‌..!

303
- Advertisement -

ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ గుండు చేయించుకోడానికి రెడీ అంటోంది. అంతేకాదు ఇప్పటి వరకు అటువంటి ప్రయోగాలు చేసే అవకాశం ఎవరికీ రాలేదని కూడా చెప్పుకొస్తోంది.

ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎందుకు గుండుకి సై అంటోందో తెలుసా..? ఓ స్క్రిప్టు కోసం. ఈ మధ్య సెలెబ్రిటీలు ‘కథ డిమాండ్ చేస్తే’ అనడం మాత్రం బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ బ్యూటీ కూడా ‘కథ డిమాండ్ చేస్తే’ అనడం మొదలుపెట్టేసింది. ఆ బాలీవుడ్‌ బ్యూటీయే దిశా పఠానీ.

 Disha Patani is ready to shave her head for a role on this

‘ఎంఎస్ ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’తో వెలుగులోకి వచ్చిన ఈ సుందరి..కథ డిమాండ్‌ చేస్తే..గుండు చేయించుకోవడం వల్ల కథకు పూర్తి న్యాయం చేసినట్టు అవుతుందని బలంగా నమ్మితే…అలాగే చేస్తానంటోంది.

మొత్తానికి హీరోయిన్లు జుత్తుతో ఎందుకు ప్రయోగాలు చేయకూడదని ప్రశ్నించిన దిశా…ఇప్పుడు కథ కోసం గుండుకి సై అంటోంది. ఇక గార్నియర్ కలర్ నేచురల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న దిశా పఠానీ.. తన జుత్తు మొత్తం వివిధ రకాల రసాయనాలతో నిండిపోయిందని తెలిపింది. కాబట్టి దానికి రోజువారీ సంరక్షించుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పుకొచ్చింది.

- Advertisement -