షాద్ నగర్ లో ‘దిశ’ మూవీ షూటింగ్

189
disha

దిశ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా దిశ ఘటనపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ సమీపంలోని బైపాస్‌ జాతీయ రహదారి చటాన్‌పల్లి బ్రిడ్జి కింద దిశను హత్య చేసిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

అలాగే చటాన్‌పల్లి శివారులో మృతదేహాన్ని కాల్చివేసిన బ్రిడ్జి వద్ద స్కూటీ, లారీతో సన్నివేశాన్ని కూడా చిత్రీకరణ చేశారు. చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసుకు పిలిపించుకుని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. కొద్ది రోజుల క్రితం శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వర్మ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.