విద్యుత్‌ కార్మిక సంఘాలతో చర్చలు సఫలం

469
current Employes
- Advertisement -

విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కార్మిక సంఘాల నాయకులతో విద్యుత్ సంస్థల అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో విద్యుత్ కార్మిక సంఘాలు అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలను విరమించుకున్నట్లు ప్రకటించాయి. జెన్ కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో టి టఫ్, తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల నాయకులతో విడివిడిగా విద్యుత్ సౌధలో శనివారం చర్చలు జరిగాయి. పూర్తి సహృద్భావ వాతావరణలో చర్చలు జరిగాయి. కార్మిక సంఘాల నాయకులు లేవనెత్తిన ప్రతీ డిమాండును అధికారులు పరిశీలించారు. న్యాయమైన, పరిష్కరించదగిన, సాధ్యమైన అన్ని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు అంగీకరించారు. ఆర్టిజన్ల సర్వీసు రూల్స్, 1999- 2004 మధ్య కాలంలో నియామకమైన కార్మికులు, ఉద్యోగుల జిపిఎఫ్ కు సంబంధించిన ప్రధాన సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించారు.

Cmd Prabhaskar Rao

ఇతర డిమాండ్లను కూడా సానుకూలంగా పరిష్కరించడానికి అంగీకరించారు. దీంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. చర్చల సందర్భంగా కుదిరిన ఒప్పందాలపై విద్యుత్ అధికారులు, కార్మికులు సంతకాలు చేశారు.విద్యుత్ సంస్థల తరుఫున జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి దేవుల పల్లి ప్రభాకర్ రావు, ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాలరావు, ట్రాన్స్ కో జెఎండి శ్రీనివాసరావు, డైరెక్టర్లు జి. అశోక్ కుమార్, బి.వెంకటేశ్వర్ రావు, పర్వతం, ట్రాన్స్ కో జిఎం జి.విజయ్ కుమార్ పాల్గొన్నారు. టి టఫ్ అధ్యక్షుడు ఎన్. పద్మారెడ్డి, కన్వీనర్ ఇ.శ్రీధర్, నాయకులు సాయబాబు, ఎంఎ వజీర్, ఎష్. ప్రభాకర్, ఎండి అబ్దుల్ మజీద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు మాట్లాడతూ.. విద్యుత్ సంస్థల్లో యాజమాన్యం, కార్మికులు అనే వ్యత్యాసం లేదు. అందరూ కుటుంబ సభ్యుల్లాగానే వ్యవహరిస్తున్నరు. అటు సంస్థ ప్రయోజనాలు, ఇటు కార్మికుల ప్రయోజనాలు, అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అందరూ సమిష్టి బాధ్యతతో వ్యవహరిస్తారు. ఆర్టిజన్లు, ఇతర కార్మికులు, ఉద్యోగులకు సంబంధించిన అంశాలను యూనియన్లు లేవనెత్తారు. మా దృష్టికి తెచ్చారు. మేము సిఎం కేసీఆర్ దృష్టికి తెచ్చాము. తీర్చగలిగిన సమస్యలను తీర్చాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు.

దీంతో కార్మికులను చర్చలకు పిలిచాము. పట్టుదలకు పోకుండా, పట్టు విడుపులతో వ్యవహరించాం. విద్యుత్ సంస్థలు తీర్చదగిన డిమాండ్లన్నింటినీ అంగీకరించాం. సాధ్యం కానివి కావని చెప్పాం. కార్మికులు, కార్మిక సంఘాలు కూడా మొదటి నుంచి సహకరించే విధంగానే వ్యవహరించారు. కాబట్టే సమస్యలను జటిలం చేసుకోకుండా, కలిసి కూర్చుని చర్చల ద్వారా సానుకూలంగా పరిష్కరించుకోగలుతున్నాం. ఉద్యోగ భద్రత లేకుండా ఏళ్ల తరబడి సేవలందించిన గౌరవ సిఎం కేసీఆర్ ఎంతో పెద్ద మనసుతో, మానవతా హృదయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను (ఆర్టిజన్లు) సంస్థలో విలీనం చేశారు.

elc

elc

- Advertisement -