అల్లు అర్జున్ బర్త్ డేకు త్రివిక్రమ్ గిఫ్ట్

347
Allu arjun Trivikram
- Advertisement -

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి మూవీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమాకి సంబంధించిన స్క్రీప్ట్ వర్క్ లో బిజగా ఉన్నారు త్రివిక్రమ్. ఈమూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈమూవీలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు.

ఆయన లుక్ ను ఖరారు చేయడం కోసం ఇటివలే ఫోటో షూట్ ను నిర్వహించారట. అల్లు అర్జున్ పుట్టిన రోజు ఎప్రిల్ 8న త్రివిక్రమ్ బన్నీ మూవీకి సంబంధించిన లుక్ ను విడుదల చేయనున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈసినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుందని సమాచారం.

ఈనెల 24 నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. అల్లు అర్జున్ సరసన కథానాయికగా పూజా హెగ్డె ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డె త్రివిక్రమ్ తో కలిసి అరవింద సమేత వీర రాఘవ మూవీలో చేసిన విషయం తెలిసిందే. ఈసినిమా తర్వాత సుకుమార్ తో చేయనున్నాడు బన్నీ.

- Advertisement -