ఇకపై సినిమాలు చేయను..!:సైరా సురేందర్ రెడ్డి

349
surender reddy

అతనొక్కడే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన దర్శకుడు సురేందర్ రెడ్డి. తర్వాత ఎన్టీఆర్‌తో అశోక్‌,ఊసరవెల్లి,మహేశ్‌తో అతిథి, రవితేజతో కిక్,కిక్‌ 2,అల్లు అర్జున్‌తో రేసు గుర్రం వంటి సినిమాలను తెరకెక్కించాడు. చివరగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ధృవ సినిమా చేసిన సురేందర్‌ రెడ్డి మెగా ఆఫర్‌ కొట్టేసి ఏకంగా చిరంజీవి హీరోగా సైరాను తెరకెక్కిస్తున్నారు.

ఇటీవలె షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగాంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇచ్చిన సంతృప్తి,కిక్ ఎంత చెప్పినా తక్కువేనని అందుకే ఇకపై తాను సినిమాలు మానేసినా బాధలేదన్నారు. సినిమా ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ ఇప్ప‌టిదాకా రిలీజైన రెండు వీడియో ప్రోమోలు చూస్తే మెగా అభిమానుల‌కు గూస్ బంప్స్ వ‌చ్చేస్తున్నాయి. ఈ సినిమా తీయ‌డంతో త‌న జ‌న్మ ధ‌న్య‌మైంద‌ని.. ఇంత పెద్ద ప్రాజెక్టును తాను డీల్ చేస్తాన‌ని ఎన్న‌డూ ఊహించ‌లేద‌ని చెప్పాడు .