ప్రభాస్ తో “సైరా” దర్శకుడు?

496
Surendar Reddy Prabhas
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. అక్టోబర్ 2న ఈమూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈసినిమాకు భారీగా స్పందన వచ్చింది. బాక్సాఫిస్ వద్ద కలెక్షన్లతో దూసుకుపోతుంది. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రామ్ చరణ్ నిర్మించిన ఈసినిమాకు సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సురెందర్ రెడ్డి ఈమూవీ చాలా అద్భుతంగా తెరకెక్కించారని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

ఇక ఈమూవీ తర్వాత సురెందర్ రెడ్డి మరో కథతో సిద్దంగా ఉన్నాడని తెలుస్తుంది. ఇటివలే యంగ్ హీరో నితిన్ కు కథ వినిపించాడట. నితిన్ కు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే నితిన్ చేతితో ప్రస్తుతం మూడు సినిమాలు ఉండటంతో తర్వాత చేద్దామని చెప్పాడట. అయితే అంతలోపు మరో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడు సురెందర్ రెడ్డి.

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఒక లైన్ వినిపించాడట. దీంతో పూర్తి కథతో రమ్మని చెప్పాడట ప్రభాస్. ప్రస్తుతం సురెందర్ రెడ్డి కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం జాన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈమూవీలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తుంది.

- Advertisement -