నా కలకు కేటీఆర్ ప్రాణం పోశారు.. డైరెక్టర్ శంకర్

138
KTR

టాలీవుడ్‌ డైరెక్టర్ ఎన్‌ శంకర్ తన ఫిలిం స్టూడియోకి ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావును కలిశారు. బేగంపేట ప్రగతి భవన్‌లో ఆయన కేటీఆర్‌ను కలిశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కేటిఆర్ తన ఫిలిం స్టూడియో స్థలానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించారని ఈ మేరకు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ఎన్.శంకర్ తెలియజేశారు. తన ఫిలిం స్టూడియో నిర్మించాలనే సంకల్పానికి, కలకి కేటీఆర్ ప్రాణం పోశారని ఈ సందర్భంగా యన్. శంకర్ తెలియజేశారు. కేటీఆర్ అందించిన సహాయ సహకారాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.