వరుణ్ తేజ్ తో మరోమూవీకి సిద్దమైన క్రిష్

392
Varun Tej Krish
- Advertisement -

ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా తర్వాత దర్శకుడు క్రిష్ మరో సినిమా చేయలేదు. తాజాగా ఉన్న సమాచారం మేరకు క్రిష్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ పింక్ రిమేక్ లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈమూవీ కూడా ప్రారంభంకానున్నట్లు తెలుస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా లో పవన్ లాయర్ గా నటిస్తున్నాడు. ఈసినిమాతో పాటు క్రిష్ తో కూడా మూవీ చేయనున్నాడు పవన్.

పౌరాణిక నేపథ్యంలో సినిమా ఉంటుందని, ఇందులో పవన్ దొంగ గా నటిస్తున్నాడని టాక్. ఇదిలా ఉండగా ఈసినిమా తర్వాత మరో మెగా హీరోను లైన్ లో ఉంచాడు క్రిష్‌. ఇటీవల ‘గద్దల కొండ గణేష్’ గా ఆకట్టుకున్న వరుణ్ తేజ్ తో కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా తర్వాత క్రిష్ తో చేయనున్నాడని తెలుస్తుంది. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో కంచె మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

- Advertisement -