కీర్తి సురేష్ పై కన్నెసిన కొరటాల శివ

257
keerthy suresh koratala shiva
- Advertisement -

మెగా స్టార్ చిరంజివి ప్రస్తుతం సైరా నరసింహరెడ్డి మూవీలో బిజీగా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ చారిత్రక చిత్రం కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నారు. ఈచిత్రం తర్వాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు చిరు. ప్రస్తుతం స్క్రీప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు దర్శకుడు కొరటాల.

ఈసినిమాలో చిరు సరసన కథానాయికగా శ్రుతిహాసన్ ను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది. మహానటి సినిమాతో తెలుగు, తమిళ్ లో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయిందిని చెప్పుకోవాలి. కీర్తి సురేష్ పబ్లిసిటిని దృష్టిలో ఉంచుకుని కొరటాల శివ ఆమెను సంప్రదించాడని తెలుస్తుంది.

అయితే శ్రుతి హాసన్ కి బదులుగా కీర్తి సురేష్ ను తీసుకున్నారా.. లేదా సెకండ్ హీరోయిన్గా ఆమెను తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఆగస్ట్ నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుందని తెలుస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ మరి చిరుతో ఏ రేంజ్ లో సక్సెస్ కొడతాడో చూడాలి.

- Advertisement -