పెళ్లి వార్తలను కొట్టిపారేసిన దిల్ రాజు..!

253
dil raju

మెగా ప్రొడ్యూసర్,నైజాం కింగ్ దిల్ రాజు(49) రెండో పెళ్లిపై కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసేలా ఓ ప్రముఖ దినపత్రిక దిల్ రాజు పెళ్లి అయిపోయిందని, కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారని వార్తను ప్రచురించింది. దీంతో ఈ వార్త వైరల్‌గా మారగా దీనిపై స్పందించారు దిల్ రాజు.

తాను ఇంకా పెళ్ళి చేసుకోలేద‌ని.. ఒక‌వేళ చేసుకునే ఉద్దేశ‌మే ఉంటే అధికారిక ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. తన పెళ్లిపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించాడు. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు.

ఇక ప్రస్తుతం దిల్ రాజు….పవన్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పింక్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించనుండగా వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా త్వరలోనే ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది.