యువతికి వేధింపులు..డయల్‌ 100కు ఫోన్

615
jangaon police
- Advertisement -

తనను వేధిస్తున్న యువకుడిని పోలీసులకు పట్టించింది ఓ యువతి. జనగాం జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మి నారాయణపురం గ్రామానికి చెందిన దివ్య అనే యువతిని అదే గ్రామానికి చెందిన సంపత్ అనే యువకుడు పెళ్ళి చేసుకోమని వేధిస్తుంటే 100 కు ఫోన్ చేసి పోలిసులకు సమాచారం అందించింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అమ్మాయిని లోకేషన్ ద్వారా తెలుసుకుని సేఫ్ గా జనగామ పోలిస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

యువతి సికింద్రాబాద్ నుండి తన స్వగ్రామమైన పాలకుర్తి మండలం లక్ష్మి నారాయణ పురంకి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వేధింపులకు గురిచేసిన యువకుడిని ఆ యువతి చిన్ననాటి క్లాస్ మేట్‌గా గుర్తించారు.

Dial 100..Quick action by police saves girl life….Dial 100..Quick action by police saves girl life…Dial 100..Quick action by police saves girl life

jangaon police

- Advertisement -