రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి ధోని..ఏ పార్టీలోకి తెలుసా?

407
Dhoni Joins Bjp
- Advertisement -

టీంఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించనున్నారని తెలిసిందే. ఈ వరల్డ్ కప్ తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రిటైర్మెంట్ తర్వాత ధోని ఏం చేస్తాడన్నది అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం త్వరలోనే ధోని బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.

త్వరలో జార్ఖండ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో ఎలాగయినా విజయం సాధించేందుకు ధోని వాడుకోవాలని చూస్తుంది బీజేపీ అధిష్టానం. జెఎంఎం, ఆర్జెడి, కాంగ్రెసు పార్టీలను ఎదుర్కోవడానికి జార్ఖండ్ లో ధోనీ ప్రజాదరణను వాడుకోవాలని బిజెపి భావిస్తోంది.

ఒకవేళ ధోనికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోతే అతన్ని ప్రచారానికైనా వాడుకోవాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తుందట. ఇప్పటికే పలువురు బీజేపీ నాయకులు ధోని సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తుంది. బీజేపీ నేతల ఆహ్వానం మేరకు ధోని పార్టీలో చేరతారో లేదో చూడాలి మరి.

- Advertisement -