హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం…

291
- Advertisement -

హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టమని టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపారు. ఎంఎస్‌ ధోని ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న ధోని.. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలను వెల్లడించాడు. తెలుగులో అపరిచితుడు, బాహుబలి సినిమా చూశానన్న ధోని…సినిమా చాలా బాగుందని కితాబిచ్చాడు.బాహుబలి సిక్వెల్ కోసం ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు. బిర్యానీతో పాటు హైదరాబాద్ గాజులు,ఉస్మానియా బిస్కెట్స్ అంటే ఇష్టమని…తన భార్య కోసం గాజులు తీసుకెళ్లినట్లు వెల్లడించాడు.

హైదరాబాదులో టీమిండియాకు మంచి రికార్డు ఉందని ధోనీ తెలిపాడు. టీమిండియా ఎప్పుడు హైదరాబాదులో ఆడినా మంచి ఫలితాలు సాధించిందని చెప్పాడు. జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో దానిపై క్లారిటీ ఉండాలని….నిజాయితీగా కష్టపడాలని అప్పుడే సక్సెస్ సాధిస్తామని తెలిపాడు. దక్షిణ భారతదేశంలో ఎంతోమంది టాలెంట్ ఉన్న హీరోలు,దర్శకులు ఉన్నారని తెలిపాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మంచి హీరో అని…సినిమాలో అద్భుతంగా నటించాడన్నారు.

MS.-Dhoni

టీ 20 వరల్డ్ కప్ గెలవటం మరిచిపోలేని అనుభూతన్నారు. గెలుపు ఓటములు క్రికెట్‌లో సహజమని…టీ 20 వరల్డ్ కప్‌ విజయంతో మంచి అవకాశాలు వచ్చాయన్నారు.

sushant-mos

ధోనీ గొప్ప కర్మయోగి అని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలిపారు. వరల్డ్ కప్ ను సాధించిన అనంతరం 130 కోట్ల మంది భారతీయులు సంబరాలు చేసుకుంటుంటే…ధోనీ మాత్రం కప్ ను అందుకుని సహచరులకు అందించి, తను మాత్రం పక్కకు వెళ్లి నిలబడ్డాడని అన్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ సమయంలో తన భావోద్వేగాలు అణచుకోలేకపోయారని, ధోనీ మాత్రం తనకేమీ పట్టనట్టు పక్కన నిలబడ్డాడని, అంత స్థిరత్వం అతనికి ఎలా వచ్చిందా? అని తాను ఆశ్చర్యపోయానని రాజమౌళి తెలిపారు. ధోనీతో ఓ ఫోటో దిగాలని ఉందని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు.

ms-dhoni-first-test-century

అంతకముందు చెన్నైలో ఎంఎస్ ధోని చిత్ర ప్రచార కార్యక్రమంలో కెప్టెన్ కూల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య ఇద్దరు పిల్లలు దివా, దేవ్‌ పాల్గొని ధోనీకి పుష్పగుచ్ఛం ఇచ్చి.. ఆయనతో కొంతసేపు గడిపారు. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సూర్య తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘మా పిల్లలకు ఎంత మధురమైన క్షణం! మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు ధోనీ.. ఈసారి వచ్చినప్పుడు మాతో డిన్నర్‌ చేయాలి…!’ అని సూర్య ట్వీట్‌ చేశారు. బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

dhoni-rajput

- Advertisement -