ధోనికి ప్రత్యామ్నాయం రావాలి:మంజ్రేకర్

279
sanjay manjrekar
- Advertisement -

ఎంఎస్‌ ధోనిపై విమర్శలు గుప్పించా రు మాజీ క్రికెటర్,కామెంటెటర్‌ సంజయ్ మంజ్రేకర్. ఫ్యాన్స్‌ ధోనిపై పెట్టుకున్న అంచనాలు తగ్గంచుకోవాలని సూచించారు. వరల్డ్ కప్‌ వరకు ధోనినే కీపర్‌గా కొనసాగించాలని అలాగే ధోనికి ప్రత్యామ్నాయంగా మరొకరని సిద్ధం చేయాలని సూచించారు.

ఒక బ్యాట్స్‌మన్‌గా ధోని ప్రపంచ స్ధాయి ప్రదర్శన ఇవ్వలుకపోతున్నాడని అన్నారు. అంతేగాదు ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని చివర స్ధానాల్లో వస్తే మంచిదన్నారు. ఆసియా కప్‌ ఫైనల్లో ధోని కంటే ముందు కేదార్ జాదవ్ రావాల్సిందన్నారు. ధోని కింది స్ధానంలో వచ్చి ఉంటే బాగుండేదని..కీపర్‌గా ధోని రాణించినా బ్యాట్స్ మెన్‌గా విఫలమవుతున్నాడని అన్నారు.

ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్‌లో అమోఘంగా ఉంటే, ఇంగ్లండ్‌ పిచ్‌లపై మాత్రం కనీసం పోరాటం ఇవ్వలేకపోయిందన్నాడు. బౌలింగ్‌ విభాగంలో టీమిండియా ఆకట్టుకుంటే, అందుకు భిన్నంగా మన బ్యాటింగ్‌ సాగిందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -