తమిళ్ లోకి ఇస్మార్ట్ శంకర్.. హీరో ఎవరో తెలుసా?

231
Ismart Shankar

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ హీరో రామ్ కాంబినేషన్ తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ యాంగిల్ లో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫిస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ ఈసినిమాతో పూరీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఛార్మీ నిర్మాతగా వ్యవహరించిన ఈసినిమాలో రామ్ సరసన నభా నటేశ్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటించారు.

పూరీ జగన్నాథ్ మాస్ డైలాగ్ లు  ఈసినిమాకి హైలెట్ అని చెప్పుకోవాలి. రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ శంకర్ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ఈసినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి భారీగా ఆఫర్లు వస్తున్నాయట. హిందీ, తమిళ్, మలయాళం నుంచి పలువురు నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం చిత్రయూనిట్ ను సంప్రదిస్తున్నారట.

ఈవిషయాన్ని హీరో రామ్, నిర్మాత ఛార్మీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే తమిళ్ లో ఓ ప్రముఖ నిర్మాత సంస్ధకు అమ్మేయడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా తమిళ్ లో హీరోగా ధనుష్ నటించనున్నాడని తెలుస్తుంది. ఈవార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక పూరీ జగన్నాథ్ తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈసినిమా ప్రారంభంకానుంది.