కత్తి మహేష్‌కు 6 నెలల నగర బహిష్కరణ..

315
Kathi Mahesh
- Advertisement -

హిందూవుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై 6 నెలల పాటు నగర బహిష్కరణ విధించారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి. 6 నెలల పాటు కత్తి మహేష్ హైదరాబాద్ లో ప్రవేశించకూడదని సూచించారు. ఒకవేళ ప్రవేశిస్తే చట్ట వ్యతిరేకత అవుతుందని, అందుకు మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని తెలిపారు. ఇక కత్తి మహేష్ ను చిత్తూరు జిల్లాలోని ఆయన సొంత ఊరులో విడిచి పెట్టేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Kathi Mahesh

ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు అయినప్పటికీ.. ఆ వ్యక్తి మాటలు ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు మాట్లాడినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సంస్థలు కూడా ఉద్రిక్తలు సృష్టించే కార్యక్రమాలు ప్రసారం చేయరాదని సూచించారు. ప్రోగ్రామ్ కోడ్ ను అతిక్రమించిన కొన్ని ఛాన్నల్లకు ఇప్పటికే నోటీసులిచ్చామని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు శాంతియుతంగా ఉండేందుకు అందరూ సహకరించాలని కోరారు.

- Advertisement -