డేరా రాసలీలలు..

244
Devis are prostitutes.. Dera
- Advertisement -

డేరా సచ్ఛా సౌధ అనే సంస్థను స్థాపించి.. ఆధ్యాత్మికత ముసుగులో ఆయన చేస్తున్న అకృత్యాలను, రాసలీలను బయటపెట్టింది ఒక లేఖ. బయటపెట్టింది. హర్యానాలోని సిస్రాలో 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న డేరా సచ్ఛా సౌధలోని సాధ్విలుగా చెబుతున్న మహిళా అనుచరులపై రాం రహీమ్ ఏ విధంగా అత్యాచారానికి పాల్పడున్నారో ఓ లేఖ ద్వారా అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి వివరించింది ఓ బాధితురాలు.

2002లో ఈ లేఖను సుమోటోగా తీసుకునే డేరా బాబాపై కేసు నమోదు చేశారు. దాన్ని సీబీఐకి బదిలీ చేశారు. సుమారు 15 సంవత్సరాలపాటు సుధీర్ఘంగా విచారించి సీబీఐ కోర్టు చివరిగా రాక్‌స్టార్ బాబాను దోషిగా తేల్చింది.

Verdict on Gurmeet Ram Rahim rape Case

డేరా గురువు సాధ్విలపై ఏ విధంగా రేప్ చేసేవారో 2009, ఫిబ్రవరి 8న అప్పటి సీబీఐ జడ్జి ఏకే వర్మకు బాధితురాలు వివరించింది. ‘నేను హర్యానాలోని యమునానగర్ నుంచి వచ్చాను. నా తల్లిదండ్రులు గుర్మీత్ బాబా భక్తులు. వారి ఒత్తిడితోనే నేనూ ఆశ్రమంలో చేరాను. ఒక రోజు రాత్రి 10 గంటల సమయంలో బాబా ప్రధాన భక్తురాలు గురుజోత్ నా దగ్గరకు వచ్చి గుఫా (డేరా బాబా రహస్య మందిరం)కు వెళ్లాలని చెప్పింది. అలాగే వెళ్లాను. ఆయన తన పక్కన కూర్చోమని ఆదేశించాడు. కూర్చున్న తరవాత నాపై చేయి వేశాడు. నన్ను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. నేను ఒప్పుకోలేదు. నేను దేవుణ్ని అన్నాడు. రివాల్వర్‌తో భయపెట్టాడు. ఒప్పుకోకపోతే నా తల్లిదండ్రులను చంపేస్తానన్నాడు. నాపై అత్యాచారం చేశాడు’ అని బాధితురాలు జడ్జికి వివరించింది.

Devis are prostitutes.. Dera

సాధ్విలపై అతను చేసే రేప్‌కి ‘పితాజీ మాఫీ’ అని పేరు పెట్టాడని, తాను చేయివేస్తే తామంతా పవిత్రులమవుతామని చెప్పేవారని బాధితురాలు వెల్లడించింది. ‘గడచిన మూడు నెలల్లో 25 నుంచి 30 రోజులకు ఒకసారి నా వంతు వచ్చేది. దీన్ని బట్టి మిగిలిన సాధ్విలపై కూడా గుర్మీత్ అత్యాచారం చేస్తున్నారని నాకు అర్థమైంది. డేరాలో ఉండే సాధ్విలంతా కన్యలని అందరూ అనుకుంటున్నారు. కానీ వైద్య పరీక్షలు నిర్వహిస్తే మేము కన్యలమో కాదో తెలుస్తుంది. డేరాలో మేమంతా తెల్లటి దుస్తులు ధరించాలి.

ముఖానికి స్కార్ఫ్ కట్టుకోవాలి. మగవారికి 10 అడుగుల దూరంలో ఉండాలి. ఇవన్నీ గుర్మీత్ ఆదేశాలు. మేం చూసేవారికి దేవతల్లా జీవిస్తున్నట్లు అనిపిస్తుంది కానీ.. మావి వ్యభిచార బతుకులు’ అని ఆమె వాపోయింది. మొత్తానికి ఆమె పోరాటానికి ఫలితం దక్కింది. రేప్ కేసులో డేరా బాబాను దోషిగా తేచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది.

- Advertisement -