బోటు ప్రమాదం…తెలంగాణ వారు 27 మంది!

508
ap boat victims
- Advertisement -

ఏపీ విహార యాత్రలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పాపికొండలు విహారయాత్రకు 73 మందితో బయలుదేరిన పర్యాటక బోటు బోల్తా పడటంతో 8 మంది మృతి చెందారు. 39 మంది గల్లంతు కాగా 26 మందిని సురక్షితంగా రక్షించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతుంది.

ఈ బోటు ప్రమాదంలో మొత్తం 27 మంది తెలంగాణకు చెందిన వారుండగా వారిలో 14 మంది గల్లంతయ్యారు. ఇందుకలో వరంగల్‌ జిల్లాకు చెందిన వారు 9 మంది ఉండగా హైదరాబాద్‌కు చెందిన వారు 5 మంది ఉన్నారు. 11 మందిని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సురక్షితంగా రక్షించగా వీరిలో వరంగల్‌కు చెందిన వారు 6 మంది, హైదరాబాద్‌కు చెందిన వారు 6 మంది ఉన్నారు. చనిపోయిన వారిలో ఇద్దరిని వరంగల్ జిల్లా వాసులుగా గుర్తించారు.

నల్గొండ జిల్లా..
అనుముల మండలానికి చెందిన ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు….

1,సురభి రవీందర్(హాలియా) సాఫ్ట్ వేర్ జాబ్..
తండ్రి పేరు….వెంకటేశ్వర్లు
తల్లిపేరు…….లక్ష్మమ్మ

.2,పాశం తరుణ్ రెడ్డి(రామడుగు) సాఫ్ట్ వేర్ జాబ్…
తండ్రి పేరు… కృష్ణారెడ్డి
తల్లి పేరు….. పద్మ…

మంచిర్యాల జిల్లా:

హాజిపూర్ మండలం పడ్తాన్ పల్లి గ్రామానికి చెందిన బొడ్డు. లక్ష్మణ్ మరియు కర్ణమామిడి గ్రామానికి చెందిన కారుకురి రమ్య గల్లంతుకాగా గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

- Advertisement -