ఎన్ డీఎంసీ అధికారులతో గౌరవ్ ఉప్పల్ సమావేశం

470
Gourav uppal
- Advertisement -

పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి  కె రామా రావు, కార్యదర్శి   అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్‌డిఎంసి ప్రాంతంలో రహదారుల మెరుగైన నిర్వహణ పద్ధతులను తెలుసుకోవడానికి జిహెచ్‌ఎంసి ఇంజనీర్లు ఎన్‌డిఎంసి చీఫ్ ఇంజనీర్ మరియు ఇతర ఇంజనీర్లతో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ ఆధ్వర్యం లో పరస్పర సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశం లో NDMC అధికారుల నుండి GHMC ఇంజనీర్లు రహదారి పరిస్థితులను మెరుగుపరచడం లో తీసుకుంటాడం చర్యలు తెలుసుకున్నారు. ఇందులో ముఖ్యంగా రహదారుల నాణ్యత, మరమ్మతుల కు స్పందించే విధి విధానాలను వివరించారు. NMDC పరిధి లో ఉన్న అధికారులు, సిబ్బంది, రహదారుల నిర్వహణ కు ఉపయోగించే సామగ్రి, వాహనాల వివరాలు, సబ్ వే ల ఏర్పాటు, వాహనాల వేగం తగ్గించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు, స్థంభించిన నీటిని శుభ్రం చేసే విధానం, రోడ్ కటింగ్ లో పాటించే నిబంధనలు,స్వయం సమృద్ధి సాధించేందుకు తీసుకుంటున అంశాలు, కాలనీ రోడ్ల నిర్వహణ, ప్రతి ఇంటి ముందు నుండి రోడ్ దారి కి తీసుకుంటున జాగ్రత్తలు, ఫూట్ పాత్ యాజమాన్యం, మరుగుదొడ్లు నిర్మాణం, ఓపెన్ జిమ్, బస్ షెల్టర్లు,సమాచార చిహనాల ఏర్పాటు, పారుదల వ్యవస్థ, కమ్యూనికేషన్ వైరింగ్, మాన్ హొల్స్ ఏర్పాటు, నిర్వహణ. ఫూట్ పాత్, రోడ్ ఇరుపకన మొక్కల ఏర్పాటు. రహదారుల రికార్పెటింగ్, చిహనాలు తిరిగి చేసే ఆవర్తకత వివరాలు తెలుసుకున్నారు.

ప్రస్తుతం జి హెచ్ ఎమ్ సి లో పాటించే రొబాటిక్ డ్రైనేజీ క్లీనింగ్ పద్ధతి ని NMDC ఇంజినీర్లు అభినందించారు. అనంతరం క్షేత్ర స్థాయి సందర్శన చేయడం జరిగింది.జి హెచ్ ఎమ్ సి నుండి చీఫ్ ఇంజినీర్లు ఆర్. శ్రీధర్, మొహమ్మద్ జియా ఉద్దీన్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు ఆర్. శంకర్ లాల్, టి. రవీంద్రనాథ్, పి. అనిల్ రాజ్. NMDC నుండి చీఫ్ ఇంజినీర్ సంజయ్ గుప్త, సూపరింటెండెంట్ ఇంజినీర్ హెచ్ పి సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె ఎమ్ గోయల్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆర్ కె శర్మ పాల్గొన్నారు.

- Advertisement -