ఢిల్లీ హైకోర్టులో మాజీ కేంద్రమంత్రికి చుక్కెదురు

151
chidambaram

కేంద్రమాజీ మంత్రి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరంకు భారీ షాక్‌ తగిలింది. ఐఎన్ ఎక్స్ మీడియా ఒప్పందంలో అవకతవకల కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈకేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. త్వరలోనే చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశీ నిధులు పొందేందుకు చిదంబరం ఆర్ధిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలోఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ ద్వారా క్లియరెన్స్ ఇప్పించారు. యూపీఏ హయాంలో జరిగిన ఐఎన్ ఎక్స్ మీడియా ఒప్పందం కేసులో నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల మేర విదేశీపెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపిస్తోంది.

ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు తలెత్తడంతో ఆయనపై కేసు నమోదైంది. హైకోర్టు చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించడంతో.. ఆయన సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు. చిదంబరం తరఫు లాయర్లు ఈ రోజే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు.