ఢిల్లీ మాజీ సీఎం కన్నుమూత

119
Sheila Deekshit

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. షిలా దీక్షిత్ వయస్సు 81 సంవత్సరాలు. 1998 నుంచి 2013వరకు ఆమె ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత 2014 మార్చి నుంచి 2014 ఆగస్ట్ వరకు కేరళ గవర్నర్ గా పనిచేశారు. ఆమె మృతికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు.

షీలా దీక్షిత్ 1938 మార్చి 31న పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలలో జన్మించారు. ఈమె న్యూఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్ లో కాన్వెంట్ విద్యనభ్యసించారు మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీలో పట్టభద్రులైయ్యారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవో జిల్లాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) గా పనిచేసిన వినోద్ దీక్షిత్ ను షిలా వివాహం చేసుకుంది.