ఆస్ట్రేలియాలో ఘనంగా దీక్ష దివస్

253
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏడు సంవత్సరాల క్రితం కె సి ఆర్ గారు చేపట్టిన ‘దీక్ష’ ను గుర్తుచేసుకుంటూ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డికాసర్ల అధ్వర్యంలో ‘కె సి ఆర్ దీక్ష దివస్’ ను ఘనంగా నిర్వహించారు. ప్రవాస తెలంగాణ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో విలియమ్స్లాండింగ్ ప్రాంతంలో ముందుగా శాంతి యాత్ర ప్రారంభించారు,గులాబీ జెండాలు చేతబూని దారి పొడవునా ప్రాంతాన్నంతా జై తెలంగాణ మరియు జై కె సి ఆర్ నినాదాలతో హోరెత్తించారు.

తదనంతర కార్యక్రమానికి ముఖ్య అతిథి గా శ్రీ రామచంద్రు తేజావత్ గారు హాజరైనారు టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ కాసర్ల మరియు ఉపాధ్యక్షుడుడాక్టర్ అనిల్ రావ్ చీటీ గార్లు అధ్యక్షత వహించి ఇటీవలే నియమింపబడిన టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా పూర్తి కార్యవర్గాన్ని కండువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారు ప్రసంగిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తన రాజకీయ పదవులన్నింటిని మరియు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ‘కె సి ఆర్ సచ్చుడో లేదా తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కె సి ఆర్ గారు చేసిన దీక్ష ప్రాముఖ్యతను వివరించారు. ఉద్యమాన్ని ముందుండి నడిపి, తద్వారా 60 సంవత్సరాల తెలంగాణ కలను సాకారం చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తన భుజస్కందాలపై వేసుకొని మునుపెన్నడూ ఎరుగని విధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొనిపోతు రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’ సాకారం చేసే దిశలో కె సి ఆర్ గారి కృషిని, పట్టుదలను వివరించారు,ఇంతటి గొప్ప నాయకుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రవ్వడం మన అదృష్టమనీ, దేశ చరిత్రలో కె సి ఆర్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ తరుణంలో ఆస్ట్రేలియా జాతికి కూడా ఆయన తాగాల్ని పరిచయం చేయడానికే ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కె సి ఆర్ పోరాట పటిమను, అలుపెరుగని పోరాటాన్ని,గాంధీజీ మార్గాన్ని అనుసరించి శాంతియుత దీక్ష ద్వారా కేంద్రం దిగివచ్చేలా చేసి తద్వారా తెలంగాణ రాష్ట్ర సిద్ధికి అయన చేసిన కృషిని కొనియాడారు.

DEEKSHA DIWAS AUSTRALIA

శ్రీ రామచంద్రు తేజావత్ గారు మాట్లాడుతూ గౌరవ కె సి ఆర్ గారు ఉద్యమ మరియు దీక్ష సమయంలో చేసిన త్యాగాలను వివరించారు. రాష్ట్రం సిద్దించిన తరువాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని, ప్రవేశపెడుతున్న పథకాల గురించి ప్రశ్నా వేదిక నిర్వహించారు. ఘనంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శులు డాక్టర్ అర్జున్ చల్లగుళ్ళ మరియు అమర్ రావ్ ,మైనారిటీ సెల్ ఇంచార్జి జమాల్ మహమ్మద్, సెక్రటరీ అభినయ్ కనపర్తిపి ఆర్ ఓ/ట్రెజరర్ సత్యం గురిజపల్లి, జాతీయ యూత్ వింగ్ అధ్యక్షుడు అమరేందర్ రావ్ చీటీ, ఈవెంట్స్ ఇంచార్జి ప్రకాష్ సూరపనేని,జాతీయ సలహాదారుడు ప్రవీణ్ రెడ్డి దేశం, విక్టోరియా స్టేట్

కోఆర్డినేటర్లు కళ్యాణ్ ఐరెడ్డి,మధు పర్స,ప్రవీణ్ లేడల్లా మరియు వెంకట్ చెరుకూరి, యూత్ వింగ్ ఇంచార్జి సనిల్ రెడ్డి బాసిరెడ్డి,బల్లారట్ ఇంచార్జి ఉదయ్ కల్వకుంట్ల,మరియు జీలాంగ్ ఇంచార్జి ఆండ్రూస్ జ్ఞానశీలన్ లతో పాటు కరీంనగర్ టి ఆర్ ఎస్ నాయకులు తిరుపతి రెడ్డి కాసర్ల ఆస్ట్రేలియాలోని లిబరల్ పార్టీ ట్రెజరర్ రాంపాల్ ముత్యాల గారు, అటాయ్ మరియు ఎం టి ఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్లు రాజ్యవర్ధన్ మరియు వెంకట్ నూకల గార్లు, సతీష్ పాటి, తెలంగాణ మధు, ప్రవీణ్ తోపుచర్ల , గారు మరియు అధిక సంఖ్యలో ప్రవాస తెలంగాణ బిడ్డలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -