వెల్లింగ్టన్ టెస్టు: తీరుమారని భారత్

212
jamieson

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలుత టాస్ గెలిచిన కివీస్…భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆదిలోనే భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. పృథ్వీ షా(16),పుజారా(11),విరాట్ (2) పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. కొద్దిసేపు కివీస్ బౌలర్లను ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్(34) ,హనుమ విహారి(3)పరుగులకు ఔట్ అవడంతో భారత్ కష్టాల్లో పడింది.

ప్రస్తుతం 5 వికెట్లు కొల్పోయి 101 పరుగులు చేసింది భారత్. 28 పరుగులతో రహానే క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమ్సన్ 3,సౌథి 1,బౌల్ట్ 1 వికెట్ తీశారు.