నాలుగు భాష‌ల్లో `డియ‌ర్ కామ్రేడ్‌` టీజ‌ర్‌..

87

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్నఎమోష‌న‌ల్ డ్రామా `డియ‌ర్ కామ్రేడ్‌`. `యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌.

ఈ సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 17న నాలుగు ద‌క్షిణాది భాషలైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

Dear Comrade

ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: భ‌ర‌త్ క‌మ్మ‌, నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచిలి, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని, సి.ఇ.ఒ: చెర్రీ, సంగీతం: జ‌స్టిన్ ఫ్ర‌భాక‌ర‌న్‌, డైలాగ్స్‌: జె కృష్ణ‌, ఆర్ట్‌: రామాంజ‌నేయులు, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: కె.వి.ఎస్‌.సుబ్ర‌మ‌ణ్యం, సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, ర‌హ‌మాన్‌, కృష్ణ‌కాంత్‌, కొరియోగ్ర‌ఫీ: దినేష్ మాస్ట‌ర్‌, యాక్షన్ డైరెక్ట‌ర్‌: జి.ముర‌ళి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనీల్, భాను, పి.ఆర్.ఒ: వ‌ంశీ-శేఖ‌ర్‌.