సూర్య వల్ల విజయ్ కి తప్పని కష్టాలు..!

89

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’. రష్మిక మందన కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కానుంది. గతంలో ‘గీత గోవిందం’ సినిమాలో నటించిన ఈ జంట మరోసారి డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు.

Vijay Deverakonda

ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌ జనాల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేయాలని యూనిట్ సభ్యులు భావించారు. అయితే అదే తేదీలో తమిళ స్టార్ హీరో సూర్య తన ‘ఎన్జీకే’ సినిమాను విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

తాజాగా సూర్య నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకోవడం ‘డియర్ కామ్రేడ్’కి ఇబ్బందిగా మారింది. తెలుగు .. తమిళ భాషల్లో సూర్య మూవీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో, రంజాన్ పర్వదినం సందర్భంగా ‘డియర్ కామ్రేడ్’ ను జూన్ 6వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.