డియర్ కామ్రేడ్….కాకినాడ షెడ్యూల్ పూర్తి

318
dear comrade
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న సంచలన హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ కాకినాడ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. గీత గోవిందం తర్వాత ఈ జోడి నటిస్తున్న రెండో సినిమా ఇది.

కాకినాడలోని అందమైన లోకేషన్స్ లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. చాలా మంది విద్యార్థులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. సినిమాలో అతిపెద్ద షెడ్యూల్ ఇదే. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది డియర్ కామ్రేడ్ . మీరు ప్రేమించే దానికోసం యుద్ధం చేయండి.. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్.. అనే ట్యాగ్ లైన్ తో డియర్ కామ్రేడ్ సినిమా వస్తుంది.

స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ఈ చిత్రం. ఇందులో విజయ్ దేవరకొండ సామాజిక బాధ్యత కలిగిన యువకుడిగా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మే ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక,సాంకేతిక నిపుణుల:కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ ,నిర్మాణ సంస్థలు: మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్,నిర్మాతలు: నవీన్ యేర్నేని, రవిశంకర్ ఎలమంచిలి, మోహన్ చెరుకూరి(సివిఎం), య‌శ్ రంగినేని,సీఈవో: చెర్రీ ,సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ ,సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్,ఎడిటర్ అండ్ డిఐ కలరిస్ట్: శ్రీజిత్ సారంగ్ ,
డైలాగ్స్: జై కృష్ణ,ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు,లిరిక్స్: చైతన్య ప్రసాద్, రెహమాన్, కృష్ణకాంత్ ,కొరియోగ్రాఫర్: దినేష్ మాస్టర్,కాస్ట్యూమ్ డిజైనర్: యశ్వంత్ బైరి, రజిని,యాక్షన్ డైరెక్టర్: జి మురళి ,పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను,పిఆర్ఓ: వంశీ శేఖర్

- Advertisement -