మహేష్‌ పాటకు మాయమైన వార్నర్‌.. వీడియో

202
David Warner
- Advertisement -

లాక్‌డౌన్‌కి ముందు క్రికెట్ గ్రౌండ్‌లో బ్యాట్‌తో బౌండరీలతో చెలరేగిన ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ప్ర‌స్తుతం టిక్ టాక్ వీడియోల‌తో సోష‌ల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాడు. తెలుగు, హిందీ, త‌మిళం ఇలా ప‌లు భాష‌ల‌కి సంబంధించిన పాటలకు, డైలాగ్స్‌కి ప‌లు టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అల‌రిస్తున్నాడు.

తాజాగా వార్నర్ ట్విట్టర్‌లో మరో వీడియో పోస్ట్ చేసి అలరించాడు. ‘షాడో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భార్య, పిల్లల మాటలు వినపడగానే’ అంటూ పేర్కొని బై బై అని ట్వీట్ చేశాడు. మహేశ్ బాబు నటించిన ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాలో మైండ్ బ్లాక్ పాటలో ‘వాడిని కొట్ట‌మ‌ను డప్పూ’ వ్యాఖ్యకు సంబంధించిన మ్యూజిక్‌ను ఆయన ఈ వీడియోకు జోడించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

- Advertisement -