పవన్, మహేష్, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ డబ్బింగ్ రైట్స్‌కు 50 లక్షలు రావు

221
- Advertisement -

భజనలు చేయకుండా ఉన్నది ఉన్నట్లు ముక్కసూటిగా మాట్లాడే మనిషి దాసరి నారాయణరావు. ఆయన విమర్శించదలుచుకున్న మనిషి ఎంత పెద్దవాడైనా వదిలిపెట్టరు. ఎవరినైనా పబ్లిక్ గా విమర్శించేస్తారు. ముఖ్యంగా సినిమా ఆడియో ఫంక్షన్లకు దాసరి వస్తున్నారంటే అక్కడ ఎవరిని టార్గెట్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఆయన మాట్లాడేవాటిలో అబద్ధాలేవీ ఉండవని మాత్రం అందరూ ఒప్పుకుంటారు. తాజాగా తమిళ డబ్బింగ్ సినిమా మాంజ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన దాసరి తెలుగు స్టార్ హీరోలకు, నిర్మాతలకు చురకలంటించారు.

పవన్, మహేష్, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి తెలుగు స్టార్ హీరోల సినిమాల డబ్బింగ్ హక్కుల కోసం తమిళ నిర్మాతలు రూ.50 లక్షలు కూడా ఇవ్వరు. అలాంటిది ఏదైనా తమిళ సినిమా ప్రారంభం అవుతోందని తెలిస్తే చాలు.. ఇక్కడ నిర్మాతలు అక్కడికి పోయి డబ్బింగ్ రైట్స్ కోసం కోట్లకు కోట్లు గుమ్మరించేస్తూ ఉంటారు. ముక్కూ, మొహం తెలియని అనామక హీరో సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కూడా కోటి రూపాయలు చెల్లిస్తారు. తెలుగు బడా నిర్మాతలూ దీనికి మినహాయింపు కాదని ఆయన అన్నారు. సాధారణంగా తాను డబ్బింగ్ సినిమాల ఆడియో ఫంక్షన్స్కు హాజరుకానని, తెలుగు సినిమాను డబ్బింగ్ సినిమాలు అణిచేస్తున్నాయని ఆయన అన్నారు. అయితే మాంజ సినిమా తాను చూశానని, చాలా బాగుందని చెప్పారు. దాసరి చెప్పిన మాటాలు అక్షరాల సత్యం. బుల్లితెరపై కూడా ఇలాంటి తంతే జరుగుతోంది. తెలుగు వార్త, వినోద ఛానళ్లలో తమిళ వాసనలు ఎక్కువయ్యాయి. అదే తమిళ ఛానళ్లు మాత్రం తెలుగు హీరోల గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించవు.

- Advertisement -