పామును కాపాడాలనుకున్నాడు కానీ.. వీడియో..

272
Snake catching
- Advertisement -

సాధారణంగా పాము అంటే ఎవరైనా భయంతో పరుగులు పెడతారు.. కానీ కొందరు పాములను చెత్తో పటుకుంటారు. అయితే ఇలా పట్టుకునే వాళ్లు ప్రొఫెషన్స్ అయివుంటారు. వారి వృత్తి కూడా పాములను పడుకొవడమే. వారు ఎలాంటి పాము అయినా వేటాడి మరీ పట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆ పాము వల్లే ప్రాణాలు పోగొట్టుకున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి. ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని భయంకరమైన విష సర్పాల వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. అయితే కేరళలోని త్రిస్సూర్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే, ఓ పాము బావిలో పడిందని షగిల్ అనే స్నేక్ ఫ్రెండ్ కు సమాచారం వచ్చింది. తొలుత వల వేసి దాన్ని బయటకు తీయాలని భావించినా, బావి లోతుగా ఉండటంతో తాళ్ల సాయంతో కిందకు దిగాలని షగిల్ భావించాడు. నెల్లగా కిందకు దిగి, పామును చూసి, దాని కాటు బారిన పడుకుండా వేల్లాడుతూ, దాని తలను బలంగా పట్టుకోగలిగాడు. అయితే, ఆ తరువాతే అతని అంచనా తప్పింది.

పామును బయటకు తీసుకుని వస్తున్న క్రమంలో, తనకేదో ఆపద తలెత్తనుందని భావించిందో ఏమో, షగిల్ ను అది గట్టిగా చుట్టేసుకుంది. అయినా, పట్టు వదలకుండా దాన్ని పట్టుకునే ఉన్నాడు షగిల్. బావి పైన ఉన్న స్థానికులు, తాడును నెమ్మదిగా లాగుతుంటే, పై వరకూ వచ్చాడు. అయితే, అతనికి చేతులు పట్టుకుని సాయం చేయాల్సిన వారు, పామును చూసి భయపడ్డారో ఏమో… ఆలస్యం చేశారు. దీంతో షగిల్ పట్టు తప్పి పాముతో సహా బావిలో మరోసారి పడిపోయాడు. అప్పటికి కూడా పాము తలను వదలని షగిల్, రెండో ప్రయత్నంలో దాన్ని బయటకు తీసుకుని వచ్చి, సమీపంలోని అడవిలో వదిలిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.

- Advertisement -