కేటీఆర్ చొరవతో బతుకమ్మ చీరల పంపిణీ: దానం

614
danam
- Advertisement -

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని గతంలో జరిగిన కొన్ని పొరపాట్ల ను దృష్టి లో ఉంచుకొని ఈ సంవత్సరం వివిధ రకాల డిజైన్ లతో మంచి నాణ్యత గల చీరలను తయారుచేయించారని టీఆర్ఎస్ నేత,ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో రేపటి నుండి బతుకమ్మ చీరల పంపిణీ మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ఆడపడుచులు సొంత అక్క చెల్లెళ్ళు గా భావించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రపంచ లొనే ప్రతి ఒక్కరు గర్వించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చినందుకు తమకు చాలా ఆనందంగా ఉందన్నారు.

bathukamma sarees

- Advertisement -