ఖైరతాబాద్‌ బరిలో దానం నాగేందర్‌..!

531
danam nagender
- Advertisement -

మాజీ మంత్రి,సీనియర్ నేత దానం నాగేందర్ ఎక్కడి నుంచి పోటీచేయాలనే దానిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం టీఆర్ఎస్‌లో చేరిన దానంకు ఖైరతాబాద్ టికెట్ ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ ప్రకటించిన తొలిజాబితాలో ఆయన పేరు లేదు. దీంతో దానంకు స్ధాన చలనం తప్పదని గోషామహల్ నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలకు పుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది.

ఖైరతాబాద్ నుంచే దానం బరిలో ఉంటారని సన్నిహిత వర్గాల సమాచారం. సీఎం కేసీఆర్‌ సైతం దానంను ఖైరతాబాద్ నుంచి బరిలో నిలిపేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించాల్సిన మిగతా 14 అసెంబ్లీ స్థానాల్లో ఖైరతాబాద్‌ స్ధానం కూడా ఉండటంతో త్వరలోనే దానం పేరును ప్రకటించనున్నారట.

Image result for దానం ఖైరతాబాద్

దానం సైతం గోషామహల్ కంటే ఖైరతాబాద్‌ నుంచే బరిలోకి దిగటానికి ఆసక్తికనబరుస్తున్నారు.ఈ క్రమంలోనే ఆయన అభ్యర్ధిత్వం ఖరారైటన్లు తెలుస్తోంది. ఇదే నియోజకవర్గం నుంచి పీజేఆర్ కూతురు విజయారెడ్డి, మన్నె గోవర్థన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు.

అయితే ఈ వార్తలను ఖండించారు దానం. తనకు ఖైరతాబాద్ టికెట్ నుంచి ఎలాంటి హామీ రాలేదని..అధినేత కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ బరిలోకి దిగేందుకు సిద్ధమని ప్రకటించారు.

- Advertisement -