జలమండలి వర్షాకాల ముందస్తు కార్యాచరణ..

234
Dana Kishore
- Advertisement -

జలమండలి ఎండీ ఎం.దానకిషోర్, ఐఏఎస్ వర్షాకాల కార్యాచరణ,సెవరెజీ ఓవర్ ఫ్లో, మంచినీటి సరఫరా వంటి విషయాలపై గురువారం రోజున ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ కోవిడ్-19 కరోనా కాలంలో కూడా మంచినీటి సరఫరా,సెవరెజీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీరు సరఫరా చేయడం పట్ల హార్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపి మంచి పనితీరు ప్రదర్శించారని తెలిపారు. కరోనా విజృంభిస్తున్న సమయాన మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రతిరోజు మేనేజర్లు శ్రద్ధ చూపాలని తెలిపారు. రిజర్వయర్ ప్రాంగణం, కార్యాలయాలు,సెవరెజీ పనిచేసే ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేయాలని, సిబ్బంది శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆదేశించారు.సెవరెజీ ఓవర్ ఫ్లో, కలుషిత నీటిపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటీకప్పుడు పరిష్కరించాలని సూచించారు. తరచుగా సెవరెజీ ఓవర్ ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్ హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు.

వర్షాకాల ముందస్తు ప్రణాళిక -2020..

రానున్న వర్షాకాలంలో నగరప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఇప్పటీకే నగరంలోని 1.5 మీటర్ల లోతు గల మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శివారు మున్సిపాలిటీల్లోని 1.5 మీటర్ల లోతు గల మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ మొదటి వారంలోగా ఈ పనులు పూర్తిచేయాలని సూచించారు.

నగరంలో వర్షాకాలంలో నీళ్లు నిలిచే 185 ప్రాంతాలను గుర్తించి.. ఆ ప్రాంతాల్లో మ్యాన్ హోళ్లకు సెఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే వర్షం వచ్చే సమయంలో సెవరెజీ సూపర్ వైజర్లను నియమించి ప్రత్యేక దృష్టి చూపాలని అధికారులను ఆదేశించారు. లోతుగా ఉన్న మ్యాన్ హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది,అధికారి జలమండలి యూనిఫాం కోట్ ధరించాలని ఎండీ ఆదేశించారు. వర్షాకాలంలో ధ్వంసమైన,మూతలు లేని మ్యాన్ హోళ్లకు తక్షణమే మరమ్మత్తు పనుల చేపట్టాలని సూచించారు. అలాగే మంచినీటి పైపు నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా చూడాలని జీఎంలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలంలో అత్యవసర పనులు చేపట్టేందుకు ఈఆర్టీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాన్ హోల్ మూతలను తెరవకూడదని సూచించారు. ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైన, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి. రవిలతో పాటు ఓ అండ్ ఎమ్ సీజీఎమ్ లు, జీఎమ్ లు పాల్గొన్నారు.

- Advertisement -