బహదూర్పురా ఫ్లైఓవర్‌..అధికారులపై దాన కిషోర్ ఆగ్రహం

69
danakishore

బహదూర్పురా ఫ్లైఓవర్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న ఆయన ఫ్లైఓవర్ నిర్మాణానికి భూ, ఆస్తుల సేకరణలో అలసత్వం వహించిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ కు చార్జి మేమో జారీ చేశారు. దీంతో పాటు సిటీ ప్లానర్ కు మేమో జారీ చేశారు.

మధుర ఫ్లైఓవర్ కు సంబంధించి 28 ఆస్తులకు సంబంధించి రెండు రోజుల్లోగా చెక్కులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2017 నుండి సుదీర్ఘకాలంగా భూసేకరణ చేయకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.