ఐడబ్ల్యూఏ అవార్డుకు దాన కిషోర్‌ నామినేట్..

628
dana kishore
- Advertisement -

జలమండలి ఎండీ దాన కిషోర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. నామినేట్ ఇంటర్ నేషనల్ వాటర్ అసోసియేషన్ (ఐడబ్ల్యూఏ ) డెవలప్ మెంట్ అవార్డుకు భారతదేశం నుంచి హైదరాబాద్ జలమండలి ఎండీ ఎం. దానకిషోర్‌ని ఎంపిక చేసింది.

జల నాయకత్వం మరియు జల సంరక్షణ (WaLC) కార్యక్రమం ద్వారా నీటి వథాను తగ్గించడం, పునర్వినియోగం, బోర్లు రీఛార్జ్ చేయడంపై దృష్టి సారించిన ఒక ప్రత్యేకమైన చొరవ మరియు నీటి సంరక్షణ అంశంపై ప్రజలలో అవగాహాన కల్పిస్తున్న విషయాలను ఈ అవార్డు నామినేషన్స్ కోసం పంపడం జరిగింది.

సుమారు 130కి పైగా దేశాల నామినేషన్లతో పోటీ పడి రెండవ దశను పూర్తి చేసుకుని ఫైనల్ కు జలమండలి ఎండీ ఎంపికయ్యారు. ఐడబ్యూఏ సెక్రటెరియట్ నుంచి ఎండీని అభినందిస్తూ, అలాగే తుది ప్రజంటేషన్ ను సమర్పించాలని కోరింది.

ప్రపంచవ్యాప్తంగా నామినేషన్లను ఆహ్వానించడం ద్వారా నీటి అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు నిపుణుల బృందం ఐడబ్ల్యుఎ డెవలప్‌మెంట్ అవార్డులను ప్రదానం చేస్తోంది. ఈ సంవత్సరం వాటర్ డెవలప్ మెంట్ కాంగ్రెస్ అండ్ ఎగ్జిబిషన్ శ్రీలంకలోని కొలంబోలో 2019 డిసెంబర్ 1-5 నుండి సస్టైనబుల్ సొల్యూషన్స్ పై జరుగుతుంది.

- Advertisement -