‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పుకున్న హాలీవుడ్‌ భామ..

233
Daisy Edgar Jones
- Advertisement -

ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకున్న హాలీవుడ్‌ భామ..

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌. ఆలియాభట్‌, డైసీ ఎడ్గార్‌జోన్స్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే “అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి తప్పుకున్నారు. ‘‘అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్‌ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నాం” అని చిత్ర బృందం ఈ ఉదయం సంచలన ప్రకటన చేసింది.

ఈ మూవీలో ఆలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ హీరోయిన్లుగా ఎంపిక చేసినట్లు ఇటీవల మీడియా సమావేశంలో రాజమౌళి ప్రకటించగా, డైసీ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపారు. ఇక సినిమా గుజరాత్ షెడ్యూల్‌ను ఆటంకాలు ఎదురైనప్పటికీ పూర్తి చేశామని రాజమౌళి ప్రకటించారు.

సరైన సమయంలోనూ షూటింగ్ పూర్తి అయిందని, ధర్మజ్ం సిద్ధాపూర్ ప్రజలు తమనెంతో ఆదరించారని, వారు చూపిన ఆదరణకు, ఆతిథ్యానికి కృతృజ్ఞతలని ట్విట్టర్ లో తెలిపారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చేడాది జులై 30 సినిమాను విడుదల కానుంది.

- Advertisement -