అతి తక్కువ కాలం సీఎంలుగా పనిచేసింది వీరే..!

692
devendra fadnavis
- Advertisement -

బీజేపీ మహా ఉత్కంఠ మరో మలుపు తిరిగింది. శివసేనకు షాకిస్తూ నాలుగు రోజుల క్రితం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బలనిరూపణకు ముందే చెతులెత్తేసిన బీజేపీకి వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు.

దీంతో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ కేవలం నాలుగు రోజులకే రాజీనామా చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలో అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన జగదాంబికాపాల్ 1998 ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు కేవలం మూడు రోజుల పాటు సీఎంగా పనిచేశారు. అదేవిధంగా కర్ణాటకకు చెందిన యడియూరప్ప 2018 మే 17 నుంచి 19 వరకు కేవలం మూడు రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

తర్వాతి స్ధానంలో దేవేంద్ర ఫడ్నవీస్ నిలిచారు. 2019 నవంబర్ 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు సీఎంగా పనిచేయగా బిహార్‌కు చెందిన సతీష్ ప్రసాద్ సింగ్ 1968 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు 5 రోజుల పాటు సీఎంగా పనిచేశారు.

ఇక హర్యానాకు చెందిన ఓం ప్రకాశ్ చౌతాలా 1990 జూలై 12 నుంచి 17 వరకు 6 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. బిహార్‌కు చెందిన నితీష్ కుమార్ 2000 మార్చి 3 నుంచి 10 వరకు 8 రోజులు సీఎంగా పనిచేశారు.

కర్ణాటకకే చెందిన యడియూరప్ప 2007లో 8 రోజుల పాటు సీఎంగా పనిచేయగా మేఘాలయకు చెందిన ఎస్‌సి మారక్ 12 రోజులు,హర్యానాకు చెందిన ఓం ప్రకాశ్‌ చౌతాలా 17 రోజులు, తమిళనాడుకు చెందిన జానకీ రామచంద్రన్ 24 రోజులు,బిహార్‌కు చెందిన బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 31 రోజులు,ఏపీకి చెందిన నాదెండ్ల భాస్కరరావు 32 రోజుల పాటు సీఎంగా పనిచేశారు.

Devendra Fadnavis’s resignation came after Ajit Pawar resigned and after a meeting between Prime Minister Narendra Modi and Home Minister Amit Shah

- Advertisement -