త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్‌ మేకింగ్ వీడియో..

777
Tamannaah
- Advertisement -

ప్రిన్స్‌ మహేష్‌ ర‌ష్మిక జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. విజ‌య‌శాంతి దాదాపు 13 ఏళ్ల త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో వెండితెర‌కి రీ ఎంట్రీ ఇస్తుంది. జ‌న‌వ‌రి 11న చిత్రం విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమాలో తమన్నా స్పెష‌ల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈపాటలో ఆర్మీ ప్యాంట్, స్పోర్ట్స్ వేర్ వేసుకుని ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇవ్వ‌బోతుంది ఈ మిల్కీబ్యూటీ.

sarileru

‘ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తు ఆజా మేరే రాజా’ అనే ఫన్నీ లిరిక్స్‌తో సాగే ఈ సాంగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో స్పెష‌ల్ సెట్ వేశారు.ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. మహేష్ బాబు,త‌మ‌న్నా పోటాపోటీగా స్టెప్స్ వేశారు.

తాజాగా డాంగ్ డాంగ్ సాంగ్‌కి సంబంధించిన మేకింగ్ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో సాంగ్‌కి సంబంధించిన విష‌యాల‌ని త‌మ‌న్నా, అనీల్ రావిపూడి పంచుకున్నారు. కాగా మహేష్ బాబు, త‌మ‌న్నా గతంలో ఆగడు సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే.

- Advertisement -