కొత్త ట్రెండ్‌ సష్టించే చిత్రంగా ‘దామిని విల్లా’..!

460
Rekha Boj
- Advertisement -

శ్రీ తిరుమల మూవీ మేకర్స్‌పై రాకేష్‌ రెడ్డి దర్శకత్వంలో పోలా రావు దండెం, ప్రతాప్‌ దండెం నిర్మిస్తోన్న హారర్‌ చిత్రం ‘దామిని విల్లా’ ఆదిత్యా ఓం, రేఖా బోజ్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘హారర్‌ చిత్రాల్లో కొత్త ట్రెండ్‌ సష్టించే చిత్రంగా ‘దామిని విల్లా’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది.

Daamini Villa Movie

ఇంతవరకు సిల్వర్‌ స్క్రీన్‌ పై రాని ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దామిని విల్లాలో ఏం జరిగింది? అనేదే చిత్రం. నిర్మాతలు ఎంతో సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమాని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రమోద్‌ కుమార్‌ పరిసర్ల; కెమెరా: శ్రీనివాస్‌ సబ్బి, ఎడిటింగ్‌: ఎమ్‌కేయస్‌ మనోజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సురేష్‌ యాదవ్, నిర్మాతలు: పోలా రావు దండెం, ప్రతాప్‌ దండెం, రచన–దర్శకత్వం: రాకేష్‌ రెడ్డి.

- Advertisement -