మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకున్న సీఎస్, డీజీపీ

252
dgp medaram

మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్నారు రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి. ఉదయం మేడారంకు చేరుకున్న డిజిపి మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ కు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు.

dgp

ఈ సందర్భంగా సీఎస్‌, డీజీపీ మేడారం జాతర ఏర్పాటు, అభివృద్ధి పనులను పరిశీలించారు. భక్తుల రద్దీ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడారం వన దేవతలను దర్శించుకోవడానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందొబస్తును ఏర్పాటు చేశారు అధికారులు.