కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పై సీఎస్ సమీక్ష

164
cs somesh kumar

నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకు సంబంధించి వివిధ శాఖలు తమ వివరాలను మార్చి 4నాటికి GADకి సమర్పించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఇవాళ బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నాతాధికారులతో నూతన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వివిధ ప్రశ్నలు, జవాబులు, ఆడిట్ పేరాలు, బడ్జెట్ సన్నద్దతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నూతన రాష్ట్రపతి చట్టం అమలుకు సంబంధించి వివిధ శాఖలు ఇప్పటికే సమర్పించిన నివేధికలపై జిఏడి, ఆర్ధిక శాఖ ద్వారా అబ్జర్వేషన్లను పంపామని, శాఖలు తమ పోస్ట్ ల వివరాలను నిబంధనలకనుగుణంగా మార్చి 4నాటికి సమర్పించాలన్నారు.

రాబోయే బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకొని , ప్రస్తుత సమావేశాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు పంపాలని, వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. పెండింగ్ ఆడిట్ పేరాలకు సంబంధించి సమాధానాలను పిఏసికి సమర్పించటానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖలు తమకు సంబంధించి వివరాల బ్రీప్ ప్రోఫైల్ ను వెంటనే సమర్పించాలని సీఎస్ అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ లు రాజేశ్వర్ తివారి, శాంతికుమారి ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణరావు, రజత్ కుమార్, సునీల్ శర్మ, శశాంక్ గోయల్, జయేష్ రంజన్, వికాస్ రాజ్ , అడిషనల్ డిజి జితెందర్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, కార్యదర్శులు ఇతర అధికారులు పాల్గోన్నారు.