సాగు నీటి రంగంపై ప్రత్యేక దృష్టిః సీఎస్

374
SK-joshi
- Advertisement -

  ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి . బి.ఆర్.కె.ఆర్ భవన్ లో యూస్ కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్ మ్యాన్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మంచి వాతావరణంలో గుడ్ ఎకో సిస్టమ్ లతో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఆమెరికా, భారత్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని అన్నారు. విద్యార్ధుల సమస్యలు ఏమైనా వస్తే వెంటనే స్పందించాలన్నారు.

యూస్ కాన్సుల్ జనరల్ జోయల్ రైఫ్ మ్యాన్ మాట్లాడుతూ.. తెలంగాణ, ఆమెరికా ల స్నేహ పూర్వక మైత్రి మరింత పెంపొందించేలా కృషి చేస్తామని అన్నారు. తెలంగాణకు అన్ని విధాల సాయం చేస్తామని చెప్పారు. ఈసందర్బంగా కాళేశ్వరం నిర్మాణం యూస్ కాన్సులెట్ బిల్డిండ్ నిర్మాణంపై చర్చించారు.

- Advertisement -