నాడు వరంగల్..నేడు సైబరాబాద్

318
cp sajjanar

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో దిశను కాల్చిచంపిన ప్రాంతంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.

వాస్తవానికి దిశ ఘటన జరిగినప్పటి నుంచే నిందితులను బహిరంగంగా ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోనే కాదు..తెలుగు రాష్ట్రాలోనే కాదు..జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో నాడు వరంగల్‌లో యాసిడ్ దాడి జరిగిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లుగాను చంపేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే వరంగల్‌లో ఘటన జరిగినప్పుడు ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. తాజాగా సైబారాబాద్‌ సీపీగా ఆయనే ఉండటంతో ఈ చర్చ తెరమీదకు వచ్చింది.

2008 డిసెంబర్ 10. వరంగల్‌‌‍లోని కిట్స్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నస్వప్నిక తన న స్నహితురాలు ప్రణీతతో కలిసిన స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా శ్రీనివాస్ అనే యువకుడు యాసిడ్ దాడి చేశాడు. యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన స్వప్నిక సికింద్రాబాద్‌లోని యశోదా అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తీవ్ర గాయాలతో ప్రణీత కు చికిత్స జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్‌తో పాటు సహకరించిన సంజయ్,హరికృష్ణ ఎన్‌కౌంటర్‌లో చనిపోగా తాజాగా దిశ నిందితులు కూడా ఎన్‌కౌంటర్‌లో హతం అయ్యారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

cp sajjanar on disha accused encounter….cp sajjanar on disha accused encounter