గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన మండలి చైర్మన్ గుత్తా

263
gutta

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా  రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అనుహ్యమైన స్పందన వస్తోంది. ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే ఈ గ్రీన్ ఛాలెంజ్ మూడు కోట్ల మైలు రాయిని దాటింది. సినీ , రాజకీయ ప్రముఖులు ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తు మరో ముగ్గురికి సవాల్ విసురుతున్నారు. తాజాగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖెందర్ రెడ్డి ఈ సవాల్ ను స్వీకరించారు.

చిట్యాలలోని తన వ్యవసాయ క్షేత్రం లో మూడు మొక్కలు నాటారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, trs నేత కర్నాటి విద్యాసాగర్ పాల్గోన్నారు. ఈసందర్భంగా గుత్తా సుఖెందర్ రెడ్డి మరో నలుగురికి సవాల్ విసిరారు. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, సాగర్ సిమెంట్ అధినేత ఆనంద్ రెడ్డి,Ntv ఛైర్మెన్ నరేంద్ర చౌదరికి సవాల్ విసిరారు.