భారత గడ్డపై కార్నివాల్ సరికొత్త రికార్డు..

499
carniwal
- Advertisement -

విండీస్ ఆల్‌రౌండర్‌,భారీకాయుడు రకీమ్ కార్నివాల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. విండీస్- అఫ్గనిస్తాన్ మధ్య జరుగుతున్న టెస్టులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా ఉన్న కార్నివాల్..తన స్పీన్ మాయాజాలంతో అప్ఘన్‌ను కుప్పకూల్చాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 7,రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసి భారత్ పిచ్‌లపై 10 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. కార్నివాల్ ధాటికి ఆఫ్గన్‌ ఆటగాళ్లంతా వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు.

ఈ క్రమంలో భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాల రికార్డుని కార్నివాల్ బద్దలు కొట్టాడు. దీంతో పాటు విదేశాల్లో ఆడే టెస్టుల్లో పది అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఏడో విండిస్ స్పిన్నర్‌గా గుర్తింపు సాధించాడు. 26 ఏళ్ల కార్నివాల్‌ బరువు 140 కేజీలు.

Rahkeem Cornwall has become the first spinner from West Indies to take a 10-wicket Test match haul in India. He has figures of 10/116 at the end of Day 2

- Advertisement -