ఈ నగలు ధరిస్తే గర్భం రాదట..!

364
- Advertisement -

అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు గర్భనిరోధక మాత్రలు, కండోమ్‌లు, పలు రకాల జెల్‌లు ఉపయోగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో గర్భని రోధానికి నేడు వివిధ మాత్రలు లభిస్తున్నాయి. కాకపోతే వీటి వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉన్నాయి. గర్భనిరోధక మాత్రలను వాడడం వల్ల కొందరు మహిళల్లో కడుపులో తిప్పిన ట్టుగా ఉంటుంది.

Contraceptive Jewellery

వాంతి వచ్చినట్టు, గ్యాస్‌ ప్రాబ్లమ్‌తో వారు ఇబ్బంది పడుతుం టారు. పొట్ట ఉబ్బి నట్టు కూడా వారికి అనిపిస్తుంది. కొందరికి నెలమధ్యలో బ్లీడింగ్‌ అవుతుంది. కొందరికి వెజెనల్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.. అంతేకాదు మాత్రలు, కండోమ్‌, జెల్‌ వాడడంతో శృంగార జీవితాన్ని సంతృప్తిగా గడపలేకపోతున్నామనే విషయాలు వ్యక్తమౌతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గర్భాం రాకుండా కొత్త పద్దతిని తీసుకురాబోతున్నారు.

Contraceptive Jewellery

జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తాజాగా నగలతో గర్భం రాకుండా చేసే పద్దతిని కనుగొన్నారు. మనం ధరించే చెవి రింగులు, వాచ్చీలు అలాగే బ్రాస్లెట్లతో గర్భం రాకుండా ఉండేందుకు ఈ కొత్త పద్దతిని అభివృద్ధి చేస్తున్నారు. వీరు తయారు చేసే చెవి రింగులకు గర్భాన్ని నిరోధించే హోర్మన్లను కోట్ చేస్తారు. నగలకు అంటిన హార్మోన్లు శరీరంలోకి ఇంకిపోయి రక్తంలో కలుస్తాయి. వీటిని ముందుగా పందులు, ఎలకలపై ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. మనుషులపైనా ప్రయోగించి త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

- Advertisement -