ప్రాంతీయ పార్టీల నుండి ఎవరైన ప్రధాని కావొచ్చు..

96
azad

బీజేపీయేతర ప్రభుత్వమే కాంగ్రెస్ ముందున్న లక్ష్యమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్. కాంగ్రెస్‌కు అధిక సీట్లు వచ్చినా ప్రాంతీయ పార్టీల నుండి ఎవరైన ప్రధాని కావొచ్చన్నారు. సిమ్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన పీఎం పదవి కాంగ్రెస్‌కు దక్కకపోయినా ఇబ్బంది లేదన్నారు.

ప్రాంతీయ పార్టీల నుండి ఎవరైనా ప్రధానిని చేయాలంటే అందుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఆజాద్ ప్రకటనతో విభేదిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా.

అత్యధిక స్ధానాలు తమ పార్టీనే గెలుస్తుందని..సాధారణంగా ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకే నాయకత్వ పదవి దక్కుతుందన్నారు. పీఎం పదవి తమకే కావాలనే సంకేతాలను కాంగ్రెస్‌ ఎప్పుడో ఇచ్చిందని మెజార్టీ పార్టీలు ఈ ప్రతిపాదనకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.