రేవంత్‌కు సీనియర్ల చెక్‌..!

621
komatireddy brothers
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో ఆదిపత్య పోరు తారాస్ధాయికి చేరుకుంది. ఇందుకు త్వరలో జరగబోయే హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక వేదికైంది. హుజుర్ నగర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా తన సతీమణి పద్మావతి పేరును ప్రకటించారు ఉత్తమ్ కుమార్. దీనికి కౌంటర్‌గా మరో అభ్యర్ధిని ప్రకటించారు రేవంత్ రెడ్డి. అంతేగాదు అందరితో చర్చించకుండా అభ్యర్ధిని ప్రకటించినందుకు ఉత్తమ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని కోరారు. దీంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లైంది.

రేవంత్ వ్యాఖ్యలను పార్టీ సీనియర్లతో పాటు క్రమశిక్షణ సంఘం కూడా సీరియస్‌గా తీసుకుంది. రేవంత్ ప్రవర్తనపై అంతర్గతంగానే కాకుండా బహటంగా సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వాళ్ల సలహాలు అవసరం లేదంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ సెంటిమెంట్‌ని రెచ్చగొడుతూ రేవంత్ పై సెటైర్లువేశారు.

గతంలో విభేదాలు ఉన్నా జానారెడ్డి, ఉత్తమ్, తాను ఒక్కటయ్యామంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌,జగ్గారెడ్డి సైతం రేవంత్ తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చించాకే హుజుర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పద్మావతిని ప్రకటించారని ఆ మీటింగ్‌లో రేవంత్ కూడా ఉన్నారని గుర్తుచేశారు. ప్రాంతీయ పార్టీలో పహిల్వాన్‌గిరి నడవొచ్చేమో గానీ, కాంగ్రెస్‌లో నడవదని రేవంత్‌పై వీహెచ్ సెటైర్లు వేశారు.

మరో వైపు రేవంత్ వ్యాఖ్యలపై తాను చింతిస్తున్నానన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. పవన్‌తో సెల్ఫీ దిగాల్సిన అవసరం తనకు లేదన్నారు. తనతోనే సెల్ఫీలు దిగేవారు చాలా మంది ఉన్నారని మండిపడ్డారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సిద్దమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -