కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

180
congress mlc candidates

స్ధానికసంస్థల కోటాలో పోటీచేసే ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. రంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మోహన్‌ రెడ్డి,నల్గొండ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి,వరంగల్ నుండి ఇనుగాల వెంకట్రామిరెడ్డిలను ప్రకటించింది. ఈ ముగ్గురు అభ్యర్థుల అభ్యర్థిత్వాలను పరిశీలించిన ఏఐసీసీ అనంతరం అమోదం తెలిపింది.

వరంగల్ జిల్లా స్ధానిక సంస్థల కోటాలో పరకాల కాంగ్రెస్ ఇంఛార్జీ ఇనుగాల వెంకట్రామిరెడ్డి పేరును పరిశీలించింది. తొలుత ఇక్కడి నుండి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి,నాయిని రాజేందర్ రెడ్డి పేర్లను పరిశీలించిన పోటీకి వారు విముఖత వ్యక్తం చేయడంతో జిల్లా నాయకుల సూచన మేరకు వెంకట్రామిరెడ్డి పేరును ప్రకటించింది.

ఇక నల్గొండ జిల్లా నుండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీరెడ్డి పేరును ప్రకటించింది. గతంలో ఈ స్ధానం నుండి ఎమ్మెల్సీగా గెలుపొందారు కోమటిరెడ్డి. అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో మునుగోడు నుండి గెలవడంతో ఎమ్మెల్సీగా ఆయన రాజీనామా చేశారు.దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ఇక రంగారెడ్డి నుండి పార్టీ సీనియర్ నేత ఉదయ మోహన్‌ రెడ్డిని ప్రకటించింది.

మరోవైపు టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వరంగల్ నుండి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,నల్గొండ నుండి తేరా చిన్నపరెడ్డి,రంగారెడ్డి నుండి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిలను బరిలో దించింది. తేరా చిన్నపరెడ్డి నల్గొండ స్ధానానికి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయగా రేపు నామినేషన్లకు చివరిరోజు కావడంతో మిగితా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.