బిగ్ బాస్ సీజన్‌ 3..కంటెస్టెంట్‌ల లిస్ట్ ఇదే..!

291
big boss 3

ఓ వైపు వివాదం..మరో వైపు ప్రారంభానికి ఇంకోరోజు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్‌ 3 ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహం నెలకొనగా మరోవైపు ఇందులో పాల్గొనే కంటెస్టెంట్‌లు ఎవరా అనేదానిపై సోషల్ మీడియాలో పలువురి పేర్లు వైరల్‌గా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్‌ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఈ సారి బిగ్ బాస్‌లో పాల్గొనే వారు వీరేనంటూ పేర్లు భయటపెట్టారు. నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ యాంకర్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, వరుణ్ సందేశ్, వితికా షెరు (జంట), సీరియల్ యాక్టర్ రవిక్రిష్ణ,టీవీ యాక్టర్ అలీ రెజా, టీవీ 9 జర్నలిస్ట్ జాఫర్,పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్, యూట్యూబ్ స్టార్ మహేష్, టీవీ నటి రోహిణి, డస్మాష్ స్టార్ అషూ రెడ్డి పాల్గోన బోతున్నారని తన యూ ట్యూబ్ ఛానల్‌ ద్వారా పాల్గొన్నారు.

ఈ సారి బిగ్ బాస్‌కిహోస్ట్‌గా కింగ్ నాగార్జున వస్తుండటంతో బుల్లితెర ప్రేక్షకుల్లోనే కాకుండా వెండితెర ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి ఏర్పడింది. 100 రోజులపాటు ఈ షో జరగనుండగా మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నారు. గతంలో మాదిరిగానే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.